
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
అధ్యక్షుడు గా చీమకుర్తి కృష్ణ చైతన్య.
ఉపాధ్యక్షుడుగా మించల బ్రహ్మయ్య
ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన కృష్ణ ,బ్రహ్మయ్య లను ఘనంగా సత్కరించిన కూటమి శ్రేణులు,
స్థానిక సంస్థల ఎన్నికలు ముగియడం తో ఎన్నికల కమిషన్ ఆదేశాలతో సింగరాయకొండ మండల ప్రజా పరిషత్ నూతన పాలకవర్గం పదవీ ప్రమాణ స్వీకారం సాదాసీదాగా జరిగింది. కొండపి నియోజకవర్గం లో సింగరాయకొండ కి ప్రత్యేకత ఉంది. మండల ప్రాదేశిక నియోజక వర్గ ఎన్నికల లో పాకల లో ఒక ఎంపిటిసి మినహా అన్ని స్థానాలను ఎన్ డి ఎ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. ముందుగా కోప్షన్ సభ్యుల ఎంపిక ప్రమాణ స్వీకారం షెడ్యూల్ ప్రకటించి చివరి క్షణాలలో దాన్ని వాయిదా వేశారు. దానితో మధ్యాహ్నం 1 గంటకి మండల ప్రజా పరిషత్ అధికారులు మండల పరిషత్ సమావేశ మందిరం లో తొలి సమావేశం ఏర్పాటు చేశారు. మండల ప్రాదేశిక నియోజక వర్గాల ఎన్నికల నిర్వహణ అధికారి సి హెచ్ సువార్త, మండల పరిషత్ అభివృద్ధిఅదికారి దారా వెంకటరావు, నూతనంగా ఎంపికై మండల ప్రాదేశిక నియోజక సభ్యుల ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎంపికయిన మెజారిటీ సభ్యుల ఆమోదం తో మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు గా చీమకుర్తి కృష్ణ చైతన్య, ఉపాధ్యక్షుడిగా మించల బ్రహ్మయ్య లను ఎన్నుకోవడం తో అధికారులు అధ్యక్ష, ఉపాధ్యక్షుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ ఎన్ వి బి రాజేష్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఎన్ డి ఎ కూటమి పార్టీల నాయకులు, అనుచరులు, సీనియర్ జర్నలిస్టులు, అధ్యక్ష ,ఉపాధ్యక్షులనునంబినందిస్తూ సత్కరించారు. ఎటువంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీస్ లు బందోబస్తు ఏర్పాటు చేశారు.