
నిజాంసాగర్, మన ధ్యాస నవంబర్ 19 , మోహమ్మద్నగర్ మండలంలోని గాలిపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో
విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజన భోజనాన్ని ఎంఈఓ వెంకటేశ్వర్లుపరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రతిరోజూ పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన, రుచికరమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల సిబ్బందికి సూచించారు.భోజనం తయారీలో నాణ్యత, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎంఈఓ సూచించారు. విద్యార్థులకు నిర్ణీత మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, భోజనం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వీరేందర్, టీచర్లు అమూల్య, సుశుమ తదితరులు పాల్గొన్నారు.