
గాజువాక మన ధ్యాస ప్రతినిధి నవంబర్ 19:బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో,అహింసా మార్గంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పెదగంట్యాడలో గత 16 సం|| సేవలందిస్తున్న అహింస పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో నూతనంగా గెలుపొందిన కార్పోరేటర్లకు అభినందన,సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఇటీవల జరిగిన జివిఎంసి ఎన్నికల్లో 92 వ వార్డు కార్పొరేటర్ గొందేసి శ్రీదేవి దంపతులు,93 వ వార్డ్ కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి,94 వార్డ్ కార్పొరేటర్ ధర్మాల రాధిక దంపతులు,95 వార్డ్ కార్పొరేటర్ కోన రాధిక దంపతులు.విజయం సాధించిన ధ్యాన కేంద్రం నిర్వాహకులు మీసాల శివ గణేశ్వరరావు ఆధ్వర్యంలో సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. అనంతరం పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. బ్రహ్మర్షి పితామహ పత్రీజీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అహింస పిరమిడ్ ధ్యాన కేంద్రం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత, ఆత్మజ్ఞానం,సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమనే విషయాన్ని ప్రతి ఒక్కరికీ చేరవేయడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గెలిచిన కార్పొరేటర్ల సహకారంతో వార్డులో విస్తృతంగా ధ్యాన శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు తోడ్పాటు అందించాలని కోరారు.ధ్యానం,శాఖాహారం,పిరమిడ్ ధ్యానం యొక్క విశిష్టతను ప్రజలకు వివరించే అవగాహన కార్యక్రమాలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ప్రజలు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకుని,ఆత్మజ్ఞానాన్ని పొందడంతో పాటు శారీరక ఆరోగ్యం,మానసిక ప్రశాంతతను సాధించి నిత్యం ఆనందంగా జీవించేలా కృషి చేయాలని ఆకాంక్షించారు. సమాజంలో సానుకూల ఆలోచనలు,అహింసా భావన,ధ్యాన సంస్కృతిని విస్తరించడంలో ప్రజాప్రతినిధుల సహకారం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ధ్యాన కేంద్రం సభ్యులు అప్పలరాజు,పోలిరాజు,శ్రీకాంత్,కనకలక్ష్మి,అచ్చుతాంబ, తులసి,గణేష్,లక్ష్మి,ఋషి,సత్యవతి,జయలక్ష్మి,రామారావు, రమణారావు,రమణమ్మ,నాగలక్ష్మి,శారద,పైడమ్మ,అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు.