మన న్యూస్:నిజాంసాగర్, జుక్కల్ మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలు మరువలేనివని కాంగ్రెస్ నిజాంసాగర్ మండలాధ్యక్షుడు ఏలె మల్లికార్జున్ పేర్కొన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన్మోహన్సింగ్ చిత్రపటానికి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అనీస్‌పటేల్,లక్ష్యయ్య,గౌస్,రాము రాథోడ్, తదితరులు పాల్గొన్నారు.మహమ్మద్‌నగర్‌లో మహమ్మద్‌నగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకాశ్,లోక్య నాయక్,సవాయిసింగ్,ఖాలీక్, తదితరులు పాల్గొన్నారు.