రేణిగుంట
తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో
జీపాలెం గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి ఒక్కసారిగా రాజుకుంది.
జీపాలెం ఎస్సీ కాలనీకి చెందిన సీనియర్ నాయకులు కాకి వెంకట సుబ్బయ్య (కె.వి. సుబ్బారావు) మంగళవారం సర్పంచ్ అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేశారు.
తన అనుచరులు, గ్రామస్తులతో కలిసి భారీగా ఎలమండ్యం గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్న ఆయన, ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు.
ఒకేసారి రెండు నామినేషన్లు.. రసవత్తరంగా పోరు:
ఈ ఎన్నికల్లో సుబ్బారావు వేసిన వ్యూహాత్మక అడుగు స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సర్పంచ్ పదవితో పాటు, జీపాలెం గ్రామ రెండో వార్డు సభ్యుడి స్థానానికి కూడా ఆయన నామినేషన్ వేశారు. గతంలో మూడు సార్లు వార్డు మెంబర్‌గా విజయం సాధించి ప్రజల మన్ననలు పొందిన సుబ్బారావు, ఇప్పుడు నాలుగోసారి వార్డు బరిలోకి దిగడం విశేషం. ఆయన అనుభవం, ప్రజాదరణతో ఈసారి ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి.
అభివృద్ధే నా ధ్యేయం.. అఖండ మెజారిటీతో గెలిపించండి: సుబ్బారావు
నామినేషన్ దాఖలు అనంతరం కాకి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. "గతంలో మూడు సార్లు వార్డు మెంబర్‌గా నన్ను ఆదరించి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను. నాకున్న గత అనుభవాన్ని పురస్కరించుకుని, రాబోయే రోజుల్లో మన పంచాయతీలో మరిన్ని మెరుగైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాను. గ్రామంలోని ప్రతి వీధిలో మౌలిక వసతుల కల్పనకు, అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తాను. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో నన్ను అఖండ మెజారిటీతో గెలిపించి, గ్రామాభివృద్ధికి మరో అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను" అని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు మరియు ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
