రేణిగుంట / తిరుపతి:
అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు ప్రాణదానం చేయడమే లక్ష్యంగా రేణిగుంట పట్టణానికి చెందిన పసేలి రాజేష్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన, మంగళవారం తిరుపతిలోని బర్డ్ (BIRRD) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక రోగి కోసం అత్యవసరంగా కావాల్సిన తన అరుదైన 'బి నెగిటివ్' (B-Negative) రక్తాన్ని దానం చేశారు.
రక్తదాన ప్రస్థానంలో రాజేష్‌కు ఇది 20వ సారి కావడం విశేషం. అత్యంత అరుదుగా లభించే బి నెగిటివ్ గ్రూప్ రక్తాన్ని సకాలంలో అందించి రోగి ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించారు.
ఈ సందర్భంగా పసేలి రాజేష్ మాట్లాడుతూ.. "రక్తదానం మహాదానం. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం ద్వారా ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడవచ్చు" అని పిలుపునిచ్చారు. 20వ సారి రక్తదానం పూర్తి చేసుకున్న రాజేష్‌ను ఆసుపత్రి వైద్య సిబ్బంది మరియు యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు.

