మనన్యూస్: చైతన్యపురి సమాజంలో విశ్వకర్మల పాత్ర మరువలేనిదని సృష్టిలో ప్రతి పనికి ముందంజలో ఉండేవారు విశ్వకర్మలని మల్కాజిరి ఎంపీ ఈటలరాజేందర్అన్నారు.అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ రాష్ట్ర సదస్సు శుక్రవారం కొత్తపేటలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్ లో జరిగింది.ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నుండి అందే ఫలాలు నేటి వరకు ఎవరికీ అందలేదో వారిని గుర్తించి ఆ ఫలాలు అందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో విశ్వకర్మల బిడ్డలైన ప్రొఫెసర్ జయశంకర్, శ్రీకాంతాచారి పాత్ర ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విశ్వకర్మలు అత్యంత ప్రీతిపాత్రులని అందుకోసం దేశవ్యాప్తంగా విశ్వకర్మ యోజన పథకాన్ని ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి కృషి చేస్తున్న ఘనత ఆయనకే దక్కిందన్నారు విశ్వకర్మల అభివృద్ధి కోసం పార్లమెంట్ లో మాట్లాడే అవకాశం వస్తే నా వంతు బాధ్యతగా మీకోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.నేటికైనా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విశ్వకర్మ నిరుపేదల జాబితాను రూపొందించి అందుబాటులో ఉంచితే తగిన సహాయ సహకారాలు అందించడానికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం జాతీయ, రాష్ట్ర కమిటీని సత్కరించి మెమెంటోలు అందజేశారు.ఈ సదస్సు రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథ చారి అధ్యక్షతన జరగగా జాతీయ అధ్యక్షులు చెడ్డిలాల్ శర్మ, సెక్రటరీ జనరల్ దినేష్ బాయ్ శర్మ, మహిళా అధ్యక్షురాలు నారోజు జ్యోతి రమణ నాయకులు ఆవంచ మురళీధర్ చారి, కాసోజు శంకరమ్మ, సంకోజు లింగా చారి, పట్నాల సావిత్రి, తల్లోజు చెన్నయ్య చారి, భాగ్యరేఖ, ఇంద్రాల అశ్విని, పడాల సతీష్ చారి,దండోజు గంగాధర్ చారి తదితరులు పాల్గొన్నారు.