
మన ధ్యాస,మక్తల్: మున్సిపాలిటీ పరిధిలో దీపావళి పండగ సందర్భంగా టపాసుల విక్రయ దుకాణాలు ఏర్పాటు చేసి వ్యాపారాలు నిర్వహిస్తున్నారని, అయితే ఆయా దుకాణాల యజమానులు అగ్నిమాపక శాఖ నుండి ఎన్ ఓ సీ పొందడంతో పాటు, మున్సిపాలిటీ నుండి తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ కూడా పొందవలసి ఉంటుందని, 7వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి కలాల్ శ్రీవిద్య నీలాగౌడ్ ప్రకటనలో తెలిపారు.ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ,కానీ కొంతమంది వ్యాపారులు మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ పొందకుండానే దుకాణాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోందని ఆమె అన్నారు.ఈ విషయంపై మున్సిపల్ రెవెన్యూ అధికారి గులాం ఖాదర్ ఖాన్ ఏ విధమైన చర్యలు తీసుకుంటురని ,ట్రేడ్ లైసెన్స్ లేకుండా దుకాణాలు నిర్వహిస్తున్నప్పటికీ ఎందుకు పర్యవేక్షణ చేయడం అన్నారు. అలాగే ఈ అంశంపై మున్సిపల్ కమిషనర్ కూడా ఎందుకు తగిన శ్రద్ధ చూపడం లేదని ఆమె ప్రశ్నించారు.ఫైర్ శాఖ నుండి ఎన్ ఓ సీ పొందినంత మాత్రాన మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ అవసరం లేదని భావించడం సరికాదని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని అనుమతులు పొందిన తర్వాతే వ్యాపారాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. మున్సిపాలిటీకి చెల్లించాల్సిన లైసెన్స్ ఫీజులు చెల్లించకుండా వ్యాపారాలు నిర్వహించడం వల్ల పురపాలక సంఘ ఆదాయానికి నష్టం కలిగే అవకాశం ఉందన్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి, ట్రేడ్ లైసెన్స్ పొందని టపాసుల దుకాణాలను గుర్తించి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజల భద్రతతో పాటు మున్సిపల్ నిబంధనల అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.