కొంకణ్ స్పెషాలిటీ సంస్థలో 48 ఖాళీలు: ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ వారికి అవకాశం – రూ. 4 లక్షల వరకు వేతనం!
తిరుపతి జిల్లా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో కొంకణ్ స్పెషాలిటీ పాలీప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో స్కిల్ కనెక్ట్ డ్రైవ్ నిర్వహించబడుతోంది.
ఈ డ్రైవ్ ద్వారా మొత్తం 48 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన ఫ్రెషర్స్ మరియు అనుభవజ్ఞులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఆర్. లోకనాధం తెలిపారు.
ఈ స్కిల్ కనెక్ట్ డ్రైవ్ లో
అందుబాటులో ఉన్న ఉద్యోగాలు:
క్వాలిటీ ఆపరేటర్ – 10 పోస్టులు
క్వాలిటీ ల్యాబ్ టెక్నీషియన్ – 2 పోస్టులు
క్వాలిటీ డాక్యుమెంటర్ – 5 పోస్టులు
ప్రొడక్షన్ అసోసియేట్ – 15 పోస్టులు
ఎక్స్ట్రూడర్ ఆపరేటర్ – 8 పోస్టులు
ఫోర్క్లిఫ్ట్ ఆపరేటర్ – 8 పోస్టులు
విద్యార్హతలు:
ITI, డిప్లొమా, 12వ తరగతి ఉత్తీర్ణులు, డిగ్రీ పూర్తి చేయని అభ్యర్థులు మరియు సంబంధిత విభాగాల్లో అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని ఉద్యోగాలకు సంబంధిత అనుభవం అవసరం. అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు పైబడి ఉండాలి.
వేతన వివరాలు:
ఉద్యోగాన్ని బట్టి సంవత్సరానికి సుమారు ₹1,92,000 నుండి ₹4,00,000 వరకు వేతనం అందించబడుతుంది. అభ్యర్థుల అనుభవం మరియు నైపుణ్యాన్ని బట్టి వేతనం నిర్ణయించబడుతుంది.
ఇంటర్వ్యూ వివరాలు:
తేదీ: 14-11-2026 (శనివారం)
వేదిక: కొంకన్ స్పెషాలిటీ పాలీప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, యూనిట్ 6, గ్రామం నం. 64, సెవిట్టుపనపాక్కన్, పొన్నేరి తాలూకా, గుమ్మిడిపూండి.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:
9440374535, 9842514480, 9597263254, 9442474603.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం naipunyam.ap.gov.in వెబ్సైట్ను సందర్శించాలి.
అర్హత కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హతల ధ్రువపత్రాలు, రెజ్యూమే మరియు ఇతర అవసరమైన పత్రాలతో ఇంటర్వ్యూకు హాజరుకావాలని ఆర్. లోకనాధం , జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి, తిరుపతి జిల్లా వారు తెలిపినారు.
