
మండల హెడ్‌క్వార్టర్స్‌లో కూటమికి షాక్..
బిట్–1, బిట్–2 స్థానాలను కైవసం చేసుకున్న వైసీపీ
పెద్దకొండూరు, నాగసముద్రంలోనూ వైసీపీ జయకేతనం.. నాలుగు ఎంపీటీసీ స్థానాల్లో విజయదుందుభి.
కలిగిరి నవంబరు 8 :మన ధ్యాస ప్రతినిధి శ్రీకాంత్ కలిగిరి మండల ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ తన సత్తా చాటింది. ముఖ్యంగా మండల హెడ్‌క్వార్టర్స్‌కు సంబంధించిన కీలకమైన బిట్–1, బిట్–2 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించి పార్టీ జెండా ఎగురవేశారు. మండల కేంద్రంలోని రెండు ప్రధాన ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.మండల కేంద్రానికి సంబంధించిన బిట్–1లో వైఎస్సార్సీపీ అభ్యర్థి పైడి కోటమ్మ 568 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించగా, బిట్–2లో పాలూరు కొండారెడ్డి 67 ఓట్ల మెజారిటీతో విజయభేరి మోగించారు. మండల హెడ్‌క్వార్టర్స్‌లోని రెండు స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులు గెలుపొందడం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.ఇదే జోరును మండలంలోని ఇతర ప్రాంతాల్లోనూ కొనసాగిస్తూ పెద్దకొండూరు ఎంపీటీసీ స్థానంలో కర్రా వెంగళరావు 116 ఓట్ల మెజారిటీతో, నాగసముద్రం ఎంపీటీసీ స్థానంలో అక్కేం రామమ్మ 145 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.మొత్తంగా కలిగిరి మండల కేంద్రంలోని రెండు కీలక స్థానాలతో పాటు పెద్దకొండూరు, నాగసముద్రం ఎంపీటీసీ స్థానాలను సైతం వైఎస్సార్సీపీ కైవసం చేసుకోవడంతో మండలంలో ఫ్యాన్ జోరు స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా మండల రాజకీయాలకు కేంద్రబిందువుగా ఉండే కలిగిరి హెడ్‌క్వార్టర్స్‌లో రెండు బిట్లలోనూ వైసీపీ జెండా ఎగరడం ఈ ఎన్నికల ఫలితాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

