మన న్యూస్:నెల్లూరు మాగుంట లేఔట్,సిపిఆర్ కళ్యాణ లో శుక్రవారం ఉదయం విద్యుత్ ఓసి ఉద్యోగ సంక్షేమ సంఘం 2025 డైరీ మరియు క్యాలెండర్ ను సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరియునెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ కార్యక్రమము రాష్ట్ర అధ్యక్షులు దాట్ల ధర్మయ్య అధ్యక్షతన జరిగింది.
ఈ కార్యక్రమునకు ముందు వివిధ జిల్లాల నుండి అధిక సంఖ్యలో పాల్గొన్న సంఘ సభ్యులు ర్యాలీ నిర్వహించి ఓసిల ఐక్యత వర్ధిల్లాలని వర్ధిల్లాలని అని నినాదాలు చేశారు విద్యుత్ సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రమోషన్లు రిజర్వేషన్ల వలన ప్రతిభగల ఓసి ,బిసి, మైనార్టీ ఉద్యోగుల అనేక ఇబ్బందులు పడుతున్నారని క్రింది క్యాడర్లో రిటైర్అ వుతున్నారు వారందరి కోసం ఈ సంఘం కోర్టు కేసులు తీర్పులు తీసుకొని రాగా అదే అవి అమలు చేయడంలో విద్యుత్ సంస్థలోని మేనేజ్మెంట్స్ అలసత్వం ప్రదర్శిస్తూ కాలయాపనచేస్తున్నాయని త్వరగా ఈ కోర్టు తీర్పులను అమలు చేయడానికి మెరిట్ సీనియార్టీ క్యాచ్అప్ రూలును పాటించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి ఓసి విద్యుత్ ఉద్యోగులు, రాష్ట్రస్థాయి,కంపెనీ స్థాయి జిల్లా స్థాయి సంఘ నాయకులు ఎఫ్ పి డి సి ఎల్ జనరల్ సెక్రటరీ వి సతీష్ ,అధ్యక్షులు వాసుదేవా రెడ్డి, ఫంక్షన్ కమిటీ చైర్మన్ ఏ సోమశేఖర్ రెడ్డి,ఐపీడీసీఎల్ జనరల్ సెక్రెటరీ తురగా రామకృష్ణ ,జాతీయ అధ్యక్షులు ఎం నాగరాజు, ఆలిండియా ఈ క్వాలిటీ ఈఫోరం జి కరుణాకర్ రెడ్డి, జాతీయ అధ్యక్షులు ఓసి సంక్షేమ సంఘం మరియు విద్యుత్ సంస్థలోని వివిధ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.ఈకార్యక్రమమునకు నెల్లూరు సర్కిల్ నిర్వహించగా, సెక్రటరీ బి. శ్రీనివాసులు, అధ్యక్షులు పి. మునిశేఖర్ వందన సమర్పణ తో సభను ముగించారు.