
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
గ్రామీణ అభివృద్ధి ధ్యేయంగా పాలన అందిస్తామంటున్న స్థానిక సంస్థల విజేతలు. గెలుపుకు సహకరించిన మంత్రి, దామచర్ల కుటుంబం , పార్టీ శ్రేణులు ఓటర్లకు ధన్యవాదాలు తెలిపిన విజేతలు. డబుల్ ఇంజన్ సర్కార్ తో అభివృద్ధి సాధ్యం అన్న నినాదం వికసిత భరత్ స్పూర్తి తో గ్రామీణాభివృద్ధి సాధన దిశగా స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచిన ఎన్ డి ఎ కూటమి అభ్యర్థులు సింగరాయకొండ లో విజయ ఢంకా మోగించారు. ఎన్డీయే కూటమి నాయకత్వం ఆడించిన విధంగా కొండపి నియోజకవర్గం సింగరాయకొండ మండలం లో ప్రత్యర్థులకు గట్టి బుద్ధి చెప్పారు.కలిసి పని చేసి విజయాలు సాధించ వచ్చునని రాజకీయ పార్టీలకు ప్రజలు పాఠం చెప్పారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, దామచర్ల సత్యనారాయణ (సత్య),దామచర్ల పూర్ణచంద్రరావు ఆశీస్సులతో ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులు ఘన విజయం సాధించడం తో కూటమి పార్టీ శ్రేణులు, ప్రజలు దీపావళి సంబరం చేసుకున్నారు. ఈ సందర్భంగా విజేతలు పార్టీ నాయకత్వానికి, మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, దామచర్ల సత్యనారాయణ ( సత్య), పూర్ణ చంద్రరావు కి ధన్యవాదాలు, కృతఙ్ఞతలు తెలిపారు.