
మక్తల్ మన ధ్యాస: మఖ్తల్ పట్టణంలోని ప్రభుత్వం డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు నారాయణపేట జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి యువజన సాంస్కృతిక పోటీలలో వివిధ రంగాలలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతులు సాధించడంతో పాటు, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఈ నారాయణ గౌడ్ తెలిపారు. కళాశాల విద్యార్థి హరి కుమార్ చిత్రలేఖనంలో అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించి జిల్లా స్థాయిలో మొదటి బహుమానం కైవసం చేసుకున్నారు. ఆయన ప్రతిభను గుర్తించిన నిపుణులు హరి కుమార్ను స్టేట్ లెవెల్ (రాష్ట్ర స్థాయి) పోటీలకు ఎంపిక చేశారు.అలాగే, ఇదే కళాశాలకు చెందిన బాలికల బృందానికి జానపద నృత్య పోటీలో జిల్లా స్థాయిలో మొదటి బహుమానం పొందారు. తెలంగాణ జానపద బాణీకి తగ్గట్టుగా అచ్చమైన మాతూరు గేయంతో అద్భుతమైన నృత్య ప్రదర్శననిచ్చి అందరి ప్రశంసలు అందుకున్నారు.వివిధ రంగాలలో కళాశాల కీర్తిని ఇనుమడింపజేస్తూ రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులు హరి కుమార్, బాలికల బృందాన్ని కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం అభినందించారు.