రేణిగుంట:
తిరుపతి జిల్లా, రేణిగుంట మండలం పరిధిలోని రేణిగుంట-5 ప్రాదేశిక నియోజకవర్గం (ఎంపీటీసీ) ఎన్నికల ఫలితాల్లో బిజెపి (BJP) అభ్యర్థి బి.డి. బాలాజీ సంచలన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, వైఎస్సార్సీపీ (YSRCP) అభ్యర్థి బి. భవనాసి నాగరాజుపై బాలాజీ స్పష్టమైన ఆధిక్యతతో విజయాన్ని అందుకున్నారు.
ఎన్నికల ఫలితాల అనంతరం రిటర్నింగ్ అధికారి రేణిగుంట-5 ఎంపీటీసీ సభ్యుడిగా బి.డి. బాలాజీ గెలుపొందినట్లు అధికారికంగా ప్రకటించి ధృవీకరణ పత్రాన్ని అందించారు. బాలాజీ విజయం పట్ల బిజెపి శ్రేణులు, మద్దతుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు
