
మక్తల్, మన ధ్యాస:ఎస్ వికేఆర్ అకాడమీ అక్షయ రెడ్డి టెక్నో& ప్లే స్కూల్ విద్యార్థుల ఆధ్వర్యంలో మక్తల్ పట్టణంలోని పలు వీధుల మీదుగా తిరుగుతూ , ఎల్. ని.నోప్రభావాన్ని ప్రజలకు తెలుపుతూ ప్లకార్డులను ప్రదర్శించి అవగాహన కల్పించారు.ఎల్ నీ నో వల్ల నష్టాలు, ఇబ్బందులను వాతవరణంలో జరిగే మార్పులు వాటి వల్ల ప్రజలకు, జీవకోటికి కలిగే ఇబ్బందులు రాబోయే రోజుల్లో నీటి కోసం తల్లడిల్లే పరిస్థితి రాబోతుందని ఇప్పటినుండే నీటిని వృథాగా చేయకుండా సేవ్ వాటర్ సేవ్ లైఫ్ అనే నినాదాలతో విద్యార్థుల చేత ప్రదర్శన నిర్వహించారు,ఈ కార్యక్రమంలోఎస్ వికేఆర్ అకాడమీ చైర్మెన్ రమేష్ శెట్టి , ప్రధాన ఉపాధ్యాయురాలు శిరీష, పాఠశాల ఇంచార్జ్ రంజాన్ పీ ఈ టీ సందీప్, శ్రీకాంత్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.