మన న్యూస్: తిరుపతి రూరల్ దివ్యాంగులపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్.బాలకృష్ణ నాయక్ తెలియజేశారు.శుక్రవారం తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రం గ్రామం నందు విలేజ్ క్లినిక్ ను ఆకస్మిక తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు.వైద్యానికి శాఖసిబ్బంది ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు గురించి ప్రజల వద్దకు వెళ్లి ఆరా తీశారు.ఈ సందర్భంగా డాక్టర్. బాలకృష్ణ నాయక్ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ఫ్రైడే"డ్రే కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో మురికి నీళ్లు నిలువ ఉండకుండా చూసుకోవాలన్నారు.మురికి నీళ్లు నిల్వ ఉండటం ద్వారా దోమలు వృద్ధి చెంది సీజనల్ వ్యాధులు డెంగు ,మలేరియా,చికెన్ గున్యా టైఫాయిడ్,బోదకాలు,వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు.వాతావరణంలో మార్పు వచ్చిందని ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నారు కాశి వడబోసిన నీళ్లను తాగాలన్నారు.ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో డి.పి.ఎమ్.ఓ.డాక్టర్ శ్రీనివాసరావు,దామినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఉదయ్ శ్రీ, ఎం. పి. హెచ్.ఈ .ఓ. డాక్టర్ శ్రీనివాసులు, హెల్త్ సూపర్వైజర్ నరేష్,ఉమా, ఎం. ఎల్. హెచ్. పి. రేఖ,ఏఎన్ఎం లలిత, ఆశా కార్యకర్తలుపాల్గొన్నారు.