
మక్తల్ మన ధ్యాస: కోర్టుకు రెగ్యులర్ జడ్జిగా అవినాష్ ను పూర్తి స్థాయిలో కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడటంతో, మక్తల్ లాయర్లు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తులు, జిల్లా బార్ అసోసియేషన్ ను కలిసి మిఠాయిలు తినిపించారు. మక్తల్ కోర్టుకు రెగ్యులర్ జడ్జిగా అవినాష్ ను పూర్తి స్థాయిలో కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జి బోయ శ్రీనివాసులు, జూనియర్ సివిల్ జడ్జి అవినాష్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సాయి మనోజ్ లను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఇకపై మక్తల్ లో పూర్తి స్థాయిలో వారంలో అన్ని పని దినాల్లో జడ్జి అందుబాటులో ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్, చెన్నారెడ్డి,మక్తల్ కోర్టు అడ్వకేట్స్ అడ్ హక్ కమిటీ అధ్యక్షుడు తిమ్మన్న అడ్వకేట్, నర్సిములు,రాజశేఖర్, రవికుమార్ గౌడ్, భరత్ కుమార్, మహేష్, మోహన్,పొర్ల ఆనంద్, శివ కుమార్, దేవసూగురు సునీత, సతీశ కుమారి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.