
కావలిలోని పీవీఆర్ విశ్వోదయ ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు
కలిగిరి నవంబర్ 2 మన ద్యాస ప్రతినిధి శ్రీకాంత్ కుట్టుబోయిన
కలిగిరి మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ రెండో సాధారణ ఎన్నికలు–2026కు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 7వ తేదీ శనివారం నిర్వహించనున్నట్లు కలిగిరి మండల రిటర్నింగ్ అధికారి సి. శివప్రసాద్ వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవంబర్ 7వ తేదీ ఉదయం 8 గంటల నుంచి కావలిలోని పీవీఆర్ విశ్వోదయ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు.కలిగిరి మండల పరిధిలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఓట్ల లెక్కింపు ఈ కేంద్రంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల కోసం అభ్యర్థులు, వారి ప్రతినిధులు అవసరమైన ఏర్పాట్లతో కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.