జెడ్పీటీసీ అభ్యర్థి జి. పాలెం తేజోవతికి అఖండ విజయం అందించాలని పిలుపు..
తేజోవతి గెలుపే లక్ష్యంగా పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఇంటింటా ప్రచారం…
రేణిగుంట:
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం రేణిగుంట పట్టణంలో కూటమి బలపరిచిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) జెడ్పీటీసీ అభ్యర్థి జి. పాలెం తేజోవతిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ అభ్యర్థి మద్దతుదారులు విస్తృతస్థాయిలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు రేణిగుంట పట్టణ టీడీపీ అధ్యక్షుడు మహబూబ్ బాషా మరియు ఎంపీటీసీ బాబుల నేతృత్వంలో ఈ ప్రచార కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను, ప్రజలకు అందుతున్న అనేక పథకాలను వివరించారు. మున్ముందు కూడా కూటమి ప్రభుత్వం ద్వారా ఎన్నో , అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నామని తెలిపారు. మండలంలో మౌలిక సదుపాయాల కల్పన, యువతకు ఉపాధి అవకాశాలు, రైతు సంక్షేమం, మెరుగైన ఆరోగ్య సేవలు మరియు మహిళా సాధికారత వంటి అనేక అభివృద్ధి పనులు చూసి కూటమి మద్దతుతో పోటీ చేస్తున్న జెడ్పీటీసీ అభ్యర్థి జి. పాలెం తేజోవతిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. రాబోయే రోజుల్లో రేణిగుంట మండలాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కూటమి నిరంతరం శ్రమిస్తుందని స్పష్టం చేశారు. అందువల్ల కమలం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి తేజోవతిని అత్యధిక మెజార్టీతో విజయం వైపు నడిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో నాయకులు కన్నా రెడ్డి, బాబు, రమ్య, సుభాన్ బాషా మరియు కూటమి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇంటింటికీ తిరుగుతూ అభ్యర్థికి మద్దతు తెలుపవలసిందిగా కోరారు.

