
కలిగిరి నవంబర్ 01, మన ధ్యాస ప్రతినిధి నాగరాజు.

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలం పెద్దకొండూరు ఎంపీటీసీ పరిధిలోని అయ్యప్ప రెడ్డి పాలెం ఊరు మరియు ఎస్టీ కాలనీ నందు ఆదివారం ఉదయం టీడీపీ ప్రచార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాలనీలోని ప్రతి ఇంటికి తిరుగుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర రైతు విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి *బొల్లినేని వెంకట రామారావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కలిగిరి మండల *జడ్పీటీసీ అభ్యర్థి మెట్టుకూరి శిరీషా రెడ్డిని*, పెద్దకొండూరు *ఎంపీటీసీ అభ్యర్థి కర్రా బాలయ్యను* సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.పింఛన్ల పెంపు - కూటమి ప్రభుత్వ ఘనత అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. ఉదయగిరి నియోజకవర్గం శాసనసభ్యులు కాకర్ల సురేష్ నియోజకవర్గం లో మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడు అని ఆయన అన్నారు. జడ్పిటిసి మరియు ఎంపీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించిన వెంటనే వీరితోపాటు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కూడా ఎమ్మెల్యేగా ఉన్నందున మనందరికీ మరింత అభివృద్ధి చేకూర్తుందని ఆయన అన్నారు. అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కేవలం రూ.2000 ఉన్న వృద్ధాప్య పింఛన్ ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.4000 కు పెంచిందని, వికలాంగుల పింఛన్ రూ.6000, తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి రూ.10,000, రూ.15,000 వరకు పెంచి ప్రతి నెల 1వ తేదీ ఉదయాన్నే లబ్ధిదారుల ఇంటి వద్దకే అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని తెలిపారు.అనంతరం ఎంపీటీసీ అభ్యర్థి కర్రా బాలయ్య మాట్లాడుతూ..నన్ను ఎంపీటీసీగా, మెట్టుకురు శిరీష రెడ్డిని కలిగిరి జడ్పిటిసి అభ్యర్థిగా గెలిపిస్తే పెద్దకొండూరు ఎస్టీ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాలనీలోని సీసీ రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి సమస్యలు, వీధి దీపాల సమస్యలను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని తెలిపారు. ప్రతి పేదవాడికి పింఛన్లు, సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.ఈ ప్రచార కార్యక్రమంలో పెద్దకొండూరు నీటి సంఘం అధ్యక్షులు ద్రోణాదుల రమేష్, నీటి సంఘం ఉపాధ్యక్షులు గూడా తిరువెంగలరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ నోటి మాల్యాద్రి రెడ్డి, మాజీ సర్పంచ్ మొక్క హజరత్ రావు, పొన్నగంటి శ్రీనివాసరావు, BMR గార్డెన్ అధినేత అయ్యప్పరెడ్డి, పాలెం, పొలంపాడు టీడీపీ గ్రామ అధ్యక్షులు కల్లూరు చంద్రమౌళి కూటమి నాయకులు , కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
