మనన్యూస్:ఏలేశ్వరం కంప్యూటర్ పితామహుడు చార్లెస్ బాబేజ్ 233వ జయంతి వేడుకలు మార్స్ కంప్యూటర్ కోచింగ్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు.గురువారం మార్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వాహకులు అడపా దుర్గారావు ఆధ్వర్యంలో బాబేజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమనికి ముఖ్య అతిథులుగా ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఇంఛార్జి ప్రయాగ మూర్తి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కంప్యూటర్ ద్వారా నేడు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఉపాధి పొందుతున్నారన్నారు. నేటి యువత కంప్యూటర్ విద్యను అలవర్చుకొని ఉన్నత శిఖరాలను అవరోధించాలన్నారు. ఈకార్యక్రమంలో బొప్పన శివ, కోరాడ రాజు,కంపరపు సత్యేంద్ర ఉప్పాడ అబ్బులు, ఉడతల రమణారావు, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.