భారీ ర్యాలీలో కదం తొక్కిన తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి , ఎమ్మెల్యేలు పులివర్తి నాని , బొజ్జల సుధీర్ రెడ్డి , పనబాక లక్ష్మి , ఆరణి మదన్ , వివిధ కార్పొరేషన్ చైర్మన్లు.తిరుపతి నగర పాలక సంస్థ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార పర్వానికి ఎన్డీఏ కూటమి శ్రేణులు అట్టహాసంగా ముగింపు పలికాయి. ప్రచార చివరి రోజున కూటమి శక్తి ఏమిటో చాటిచెబుతూ కోర్లగుంట రోడ్డులో నిర్వహించిన భారీ ర్యాలీ తిరుపతి రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలతో కోర్లగుంట ప్రధాన రహదారి జనసముద్రాన్ని తలపించింది.ర్యాలీ ప్రారంభమైనప్పటి నుండి ముగిసే వరకు కోర్లగుంట పరిసర ప్రాంతాలు కూటమి జెండాలతో రెపరెపలాడాయి. ఒకవైపు మిరుమిట్లు గొలిపే బాణసంచా వెలుగులు, మరోవైపు డప్పు వాయిద్యాలు, తీన్మార్ నృత్యాలతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది.
తమ అభిమాన నేతలపై స్థానికులు, మహిళలు భవనాల పైనుండి పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు.
"జై కూటమి" నినాదాలతో కోర్లగుంట వీధులు మార్మోగిపోయాయి. ఈ మెగా ర్యాలీలో కూటమి ముఖ్య నేతలు ఒకే వేదికపై కదం తొక్కడంతో కార్యకర్తల్లో ఉత్సాహం కట్టలు తెంచుకుంది. తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి , చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని , శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి , తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు పనబాక లక్ష్మి , తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తనయుడు ఆరణి మదన్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ, కార్యకర్తల్లో జోష్ నింపుతూ నేతలు ముందుకు సాగారు.
తిరుపతి నగర సర్వతోముఖాభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని స్పష్టం చేశారు. కోర్లగుంటలో కనిపిస్తున్న ఈ ప్రజా ప్రభంజనమే రేపటి ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల అఖండ విజయానికి నిదర్శనమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు పరిష్కారం కావాలన్నా, తిరుపతి కార్పొరేషన్లో పారదర్శక పాలన అందాలన్నా కూటమి బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు వేలాదిగా పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.


