నగర సమగ్రాభివృద్ధి మరియు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి , మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ ఓటర్లకు పిలుపునిచ్చారు.
54వ డివిజన్ పరిధిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని,కూటమి శ్రేణులతో కలిసి ఓటర్లను అభ్యర్థించారు.
ఈ సందర్భంగా డా. డాలర్స్ దివాకర్ రెడ్డి .. తిరుపతి నగరాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఇందులో భాగంగా ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థి మన్నెం శ్రీనివాస్ ప్రసాద్ (జేబీ శ్రీనివాస్) కి సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఘనవిజయం చేకూర్చాలని కోరారు.
అదేవిధంగా, 54వ డివిజన్ ఎన్డీఏ కూటమి జనసేన కార్పొరేటర్ అభ్యర్థి బోయళ్ళ శాంతి కి గాజు గ్లాసు గుర్తుపై, మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
తిరుపతి నగరంలో మౌలిక సదుపాయాల కల్పన, మెరుగైన పారిశుద్ధ్యం, త్రాగునీరు మరియు అంతర్గత రహదారుల అభివృద్ధికి కూటమి అభ్యర్థుల గెలుపు ఎంతో కీలకమని తుడా ఛైర్మన్ డా డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు.
డివిజన్ పరిధిలోని ప్రతి గడపకూ కూటమి మేనిఫెస్టోను, అభివృద్ధి ఆశయాలను చేరవేసేలా ప్రత్యేక ప్రచార వాహనాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ముఖ్య నాయకులు, 54వ డివిజన్ కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానిక ప్రజలు పాల్గొని అభ్యర్థులకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

