రేణిగుంటలో ప్రజా సమస్యలపై అనునిత్యం పోరాడే.. ప్రశ్నించే సిపిఎం పార్టీ అభ్యర్థికే ఓటు వేద్దాం! రేణిగుంట 3వ సెగ్మెంట్ ఎంపీటీసీ ఎన్నికల సిపిఎం పార్టీ గుర్తు "సుత్తి_ కొడవలి_ నక్షత్రం" గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటరు మహాశయులకు రేణిగుంట సిపిఎం పార్టీ ప్రాంతీయ కమిటీ కన్వీనర్ కొండ్రెడ్డి హరినాథ్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నాడు సిపిఎం పార్టీ మాజీ ఎంపీటీసీ సభ్యురాలు ఎన్. రాజేశ్వరి నాయకత్వంలో వినాయక నగర్ నందు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రేణిగుంట 3వ సెగ్మెంట్ సిపిఎం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి బలిపంగి భారతి ఎన్నికల ప్రచారంలో సిపిఎం నాయకత్వం కొండ్రెడ్డి హరినాథ్, ఎన్. రాజేశ్వరి, సీనియర్ నేత వెంకటరమణ, సెల్వరాజ్, సత్య శ్రీ, రాజశేఖర్, దీప, అమ్ములు, మునిస్వామి, పద్మావతి, రాముడు తదితరులు పాల్గొని ఇంటింటికి తిరిగి కరపత్రం ఇచ్చి సిపిఎం పార్టీ ఎన్నికల గుర్తు "సుత్తి_ కొడవలి_ నక్షత్రం" గుర్తుపై ఓటు వేసి ప్రజా సమస్యలపై పోరాడే, ప్రశ్నించే సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని ప్రజా ఓటర్లను కోరారు. రాజకీయ పార్టీల ప్రలోభాలకు, డబ్బుకు లొంగకుండా ఆలోచించి ఓటు వేయాలని వినాయక నగర్, గౌరీ నగర్, పాంచాలి నగర్, బిస్మిల్లా నగర్, వసుంధర నగర్, వివేకానంద కాలనీ ఓటరు మహాశయులకు విజ్ఞప్తి చేశారు.

