
నిజాంసాగర్, మన ధ్యాస ,అక్టోబర్ 29 , గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలకు మెరుగైన వసతులు కల్పించే దిశగా పనిచేస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు,నిజాంసాగర్ మండలంలోని మల్లూరు తండా, బంజపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించనున్న మహిళా సంఘాల భవనాలకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ లు కలిసి కొబ్బరికాయ కొట్టి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..
మహిళా సంఘాల సభ్యులు సమావేశాలు నిర్వహించుకోవడానికి, సంఘ కార్యకలాపాలను సమర్థవంతంగా కొనసాగించడానికి ఈ భవనాలు ఉపయోగపడనున్నాయి. గ్రామీణ మహిళలు సంఘటితంగా ముందుకు సాగేందుకు, వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ఈ వసతులు దోహదపడతాయని అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా గ్రామ అధ్యక్షుడు ఎన్నిక కావడంతో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గ్రామ అధ్యక్షులు గాండ్ల రమేష్ శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో అచ్చంపేట్ సొసైటీ చైర్మన్ పట్లోల జనార్దన్ రెడ్డి మండల అధ్యక్షులు ప్రజాపండరి ,రవీందర్ రెడ్డి,సర్పంచులు వడ్ల పండరి,మోహన్,నాయకులు నాగభూషణం గౌడ్ ,బంగ్లా ప్రవీణ్ కుమార్,రామకృష్ణ,బాలా సాయిలు,ఎంపీడీవో శివకృష్ణ, ఐకెపి సీసీ సాయిలు, సభ్యులు తదితరులున్నారు,
