

భీమిలి మన ధ్యాస ప్రతినిధి అక్టోబర్ 29: తగరపువలస,భీమిలిలో వైఎస్సార్సీ మేయర్అభ్యర్థి వరుదు కళ్యాణి గెలుపు కోసం అలాగే కార్పొరేటర్లు గెలుపు కోసంతెలుగుశక్తి అధినేత బి.వి.రామ్ తగరపువలస ప్రచారం నిర్వహించారు.అనంతరం బి.వి.రామ్ పత్రికా సమావేశంలో మాట్లాడుతూవిశాఖ నగరంలోని ప్రజా ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్ పేర్కొన్నారు.విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామనిచెప్పే పాలకులు,ముందుగా నగర ప్రజల ఆస్తులు,హక్కులు,భవిష్యత్తుకు భరోసా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.దశాబ్దాలుగా విశాఖఅభివృద్ధికి ఎంతోమంది నాయకులు,కార్మికులు,సామాన్య ప్రజలు కృషి చేశారని,వారి శ్రమతో రూపుదిద్దుకున్న నగర సంపదను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ప్రజలకు చెందాల్సిన భూములు,ప్రభుత్వ ఆస్తులు, అభివృద్ధి నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత ఉండాలని స్పష్టం చేశారు.ప్రజా ఆస్తులకు సంబంధించి ఎలాంటి అక్రమాలు జరిగినా వాటిపై నిష్పక్షపాత విచారణ జరిపివాస్తవాలనుప్రజలముందుంచాలని కోరారు.విశాఖ అభివృద్ధి అంటే భవనాలు, రహదారులు మాత్రమే కాదు..ప్రజల ఆస్తులకు రక్షణ, పేదలకు న్యాయం, యువతకు ఉపాధి, ప్రతి కుటుంబానికి భద్రత కల్పించడం కూడా అభివృద్ధిలో భాగమేనని బి.వి.రామ్ అన్నారు. నగరాన్ని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దాలంటే ప్రజల ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యంగా ఉండాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్టపోయిన కుటుంబాలకు తక్షణ సహాయం, న్యాయమైన నష్టపరిహారం అందించాలని, బాధితులను రాజకీయాలకు అతీతంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతులను అణచివేయడం కాకుండా,వారి సమస్యలను పరిష్కరించడమే ప్రజాస్వామ్య పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు.రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు, రాజకీయ పారదర్శకత,ప్రజల హక్కులు కాపాడబడాలని ఆయన అన్నారు.ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు,బెదిరింపులు,అధికార దుర్వినియోగంపై ఫిర్యాదులు వస్తే చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రజల ఆస్తులు ప్రజలకే చెందాలి.. ప్రజాధనం ప్రజల సంక్షేమానికే వినియోగించాలివిశాఖ ప్రజల హక్కులకుభంగంకలిగితే తెలుగు శక్తి చూస్తూ ఊరుకోదు. పార్టీలు,వ్యక్తులకు అతీతంగా ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ, ప్రజలకు న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగిస్తాం అనిబి.వి.రామ్ స్పష్టం చేసినట్లు తెలిపారు. యువత,ప్రజాస్వామ్యవాదులు,ప్రజా సంఘాలు నగర ఆస్తుల పరిరక్షణకు ముందుకు రావాలని పిలుపునిస్తూ, విశాఖ భవిష్యత్తును కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని రామ్ పేర్కొన్నారు.ధరల భారం.. నెరవేరని హామీలు..!కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై ఆర్థిక భారం మరింత పెరిగిందని రామ్ ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలతో పాటు ఇతర ఖర్చులు కూడా భారీగా పెరిగాయని,సామాన్య కుటుంబాలుతీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన సంక్షేమ హామీల్లో అనేకం ఇప్పటికీ అమలు కాలేదని,ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వంటి హామీలు నెరవేరక ప్రజలు నిరాశ చెందుతున్నారని విమర్శించారు.ప్రార్థనతో వర్షం కురిపించానంటే అర్నబ్ తుఫాన్‌ను ఎందుకు అడ్డుకోలేకపోయారు?తుఫాన్ వల్ల జరిగిన భారీ నష్టాలకు బాధ్యత ఎవరిది?ఎన్నికల్లో ఇచ్చిన సంక్షేమ హామీలు ఎందుకు అమలు కాలేదు?గ్యాస్ సబ్సిడీ,ఇతర పథకాల పరిస్థితి ఏమైంది?ధరల పెరుగుదలపై ప్రభుత్వం ఎందుకు నియంత్రణ సాధించలేకపోతోంది?ప్రజల సమస్యల పరిష్కారమేప్రభుత్వ బాధ్యత అని రామ్ తెలియజేశారు. టీడీపీ మేయర్ అభ్యర్థి డమ్మీ మాత్రమే: తెలుగు శక్తి జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో కూటమి మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణిపై,అలాగే ఎంపీ భరత్ పాత్రపై తెలుగు శక్తి తీవ్ర విమర్శలు చేశారు.కూటమితరఫున ముక్కా శ్రావణిని కేవలం డమ్మీ అభ్యర్థిగా నిలబెట్టారని,అసలు నిర్ణయాలు మరొకరి చేతుల్లోనే జరుగుతున్నాయనే విమర్శలు ప్రజల్లో వినిపిస్తున్నాయని ఆరోపించారు. విశాఖ నగర అభివృద్ధి,తాగునీటి సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పన,పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లగల నాయకత్వం వైసీపీకే ఉందని పేర్కొన్నారు.నగర సమగ్రాభివృద్ధి కోసం జీవీఎంసీ మేయర్‌గా వైసీపీ అభ్యర్థి వరుదు కల్యాణిని అత్యధిక మెజారిటీతో గెలిపించే బాధ్యత విశాఖ ప్రజలపై ఉందని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జీవీఎంసీ2వ వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థి అక్కరమాని రామునాయుడు,రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శి జీరు వెంకట రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బింగి హరికిరణ్ రెడ్డి, భీమిలి నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు డబ్బీరు ప్రశాంతి పట్నాయక్, ప్రధాన కార్యదర్శి చిప్పాడ వెంకటేష్,సీనియర్ నాయకులు నమ్మి లక్ష్మణ్ రావు తెడ్లాపు అప్పలరాజు,కంచుబోయిన వెంకటరావు,నీలాపు రాము రెడ్డి,చెట్ల నర్సింగ్,చెట్ల శ్రీను,నమ్మి సత్తిబాబు, డాక్టర్ పప్పూర్ నికుంజ్,తదితరులు పాల్గొన్నారు.