
కలిగిరి బిట్-1 లో సైకిల్ హోరు - వెంకన్న పాలెం లో అల్లరి చంద్ర కళ కు ఘన స్వాగతం
కలిగిరి అక్టోబర్ 29, మన ధ్యాస ప్రతినిధి నాగరాజు.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలోని వెంకన్నగ్రామ గ్రామంలో కలిగిరి బిట్-1 ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థి *అల్లరి చంద్రకళ* విస్తృతస్థాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ... కలిగిరి బిట్-1 ఎంపీటీసీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నానని, సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రి *నారా చంద్రబాబు నాయుడు* నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అద్భుతంగా అమలు చేస్తోందని తెలిపారు. ముఖ్యంగా పింఛన్లను రూ.4000 లకు పెంచి, వికలాంగులకు రూ.6000, కిడ్నీ బాధితులకు రూ.10,000 ఇస్తూ ప్రతి నెలా 1వ తేదీనే ఇంటి వద్దకే అందిస్తూ అవ్వా తాతలకు అండగా నిలుస్తోందని వివరించారు.అదేవిధంగా ఉదయగిరి ఎమ్మెల్యే *కాకర్ల సురేష్* నాయకత్వంలో ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, ఎంపీటీసీగా గెలిచిన వెంటనే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ *పూసల వెంగప నాయుడు*, మండల ప్రధాన కార్యదర్శి *కొప్పుల కొండలరావు*, ఉదయగిరి నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షుడు *స్వర్ణ కొండయ్య*, సతీష్, ఊస మాల్యాద్రి, ఊసా మధు, స్వర్ణ రమేష్, రొడ్డ మహేష్, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
