
మన ధ్యాస, నెల్లూరు, అక్టోబర్ 25 : నెల్లూరు నగరంలోని స్థానిక పొగ తోట ప్రాంతంలో డాక్టర్ వై. సంజీవరావు ఈ ఎన్ టి హాస్పిటల్ ను సింహపురి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ అక్షిత్ మాట్లాడుతూ చెవి, ముక్కు గొంతు వ్యాధుల ప్రత్యేక చికిత్సలు నిమిత్తం డాక్టర్ వై సంజీవరావు ఈఎన్టీ హాస్పిటల్ ను సింహపురి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. సామాన్య ప్రజలకు సైతం వైద్య చికిత్సలు అందించుటకు డాక్టర్ వై నరసింహ రావు ఇఎన్‌టి హాస్పిటల్ వేదికగా నిలవబోతుందని ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యంగా మనిషిలో ఉన్న అవయవాలలో వినికిడి, వాసన, ఆహారం తినగలిగే సదుపాయం కలిగిన గొంతు భాగాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందన్నారు. చెవి ,ముక్కు, గొంతు వ్యాధులను నిర్లక్ష్యం చేసినట్లయితే తగిన మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని హెచ్చరించారు. గత 40 సంవత్సరాల చరిత్ర కలిగిన డాక్టర్ వై నరసింహ రావు హాస్పిటల్లో నూతనంగా ప్రారంభించబడిన డాక్టర్ వై. సంజీవరావు ఈఎన్టి హాస్పిటల్ వైద్య సేవలను సింహపురి ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఈఎన్టీ విభాగాలకు సంబంధించి,అధునాతన సదుపాయాలను వినియోగంలోకి తీసుకురావడం జరిగిందని చెప్పుటకు సంతోషంగా ఉందన్నారు. అవకాశాన్ని సింహపురి ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. వైద్య సేవలు మరియు ఓపి విభాగాలకు సంబంధించి ముందుగా తమ పేర్లను నమోదు చేయించుకొనుటకు 7995566570 నంబర్‌ను సంప్రదించాల్సిందిగా కోరారు. ఈ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ అక్షిత్ తల్లిదండ్రులు సురేంద్రనాథ్, శిరీష డాక్టర్ బి. అక్షిత్, డాక్టర్ రాజేష్, ప్రముఖ రేడియాలజిస్ట్డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సురేంద్రనాథ్, శిరీష, ప్రముఖ న్యాయవాది ఏ.సతీష్ కుమార్, సనాతన రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


