తిరుపతి
తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి ని రేణిగుంట మండలానికి చెందిన కూటమి పార్టీ ఎంపీటీసీ అభ్యర్థులు మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక కార్యాలయంలో ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి తో అభ్యర్థులు కాసేపు సమావేశమై, రేణిగుంట మండలంలోని రాజకీయ పరిస్థితులు మరియు గ్రామాల్లో నెలకొన్న స్థానిక పరిస్థితులపై చర్చించారు.ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల కూటమి ఎంపీటీసీ అభ్యర్థులతో పాటు పలువురు స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

