
కలిగిరి, అక్టోబర్ 22, మన ధ్యాస ప్రతినిధి నాగరాజు:
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలం పెద్దకొండూరు ఎంపీటీసీ నుండి టీడీపీ అభ్యర్థులుగా మొదటి అభ్యర్థిగా ఉన్నిమద్దెల తిరుపాలు, రెండవ అభ్యర్థిగా కర్రా బాలయ్య గురువారం నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి మద్దతుతో వారు తమ నామినేషన్ పత్రాలను కలిగిరి ఎంపీడీవో కార్యాలయంలో అధికారులకు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెద్దకొండూరు ఎంపీటీసీ పరిధిలోని పొలంపాడు, ఏపీనాపి,రావుకొల్లు గ్రామ పంచాయతీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో భాగంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో కలిసి గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.*"పొలంపాడు, ఏపీనాపి, రావుకొల్లు గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, సైడ్ కాలువల నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతాం. అదేవిదంగా తాగునీరు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులకు ప్రాధాన్యత ఇస్తాం అని వారు హామీ ఇచ్చారు.రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో,ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సహకారంతో పెద్ద కొండూరు ఎంపీటీసీ పరిధిలో మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
