
కలిగిరి, అక్టోబర్ 22: మన ద్యాస ప్రతినిధి శ్రీకాంత్
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కలిగిరి జడ్పీటీసీ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా మెట్టుకూరు శిరీష రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఆమె నామినేషన్‌తో కలిగిరి మండలంలో రాజకీయ సందడి నెలకొంది. కూటమి శ్రేణుల్లో ఉత్సాహం కనిపించగా, స్థానిక రాజకీయ వర్గాల్లోనూ ఆమె అభ్యర్థిత్వంపై చర్చ మొదలైంది.మెట్టుకూరు శిరీష రెడ్డి గతంలో కలిగిరి మండల పరిషత్ అధ్యక్షురాలిగా (ఎంపీపీ) పనిచేశారు. ఆ సమయంలో మండల అభివృద్ధి కార్యక్రమాల్లో, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆమె పోషించిన పాత్రను పలువురు గుర్తు చేసుకుంటున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న నాయకురాలిగా ఆమెకు స్థానికంగా గుర్తింపు ఉందని కూటమి వర్గాలు పేర్కొంటున్నాయి.మాజీ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి సతీమణి అయిన శిరీష రెడ్డి జడ్పీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగడంతో కలిగిరి మండల రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. గతంలో మండల పరిషత్ అధ్యక్షురాలిగా పనిచేసిన అనుభవం, ప్రజలతో ఉన్న పరిచయాలు ఎన్నికల్లో తమకు కలిసివస్తాయని కూటమి నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.శిరీష రెడ్డి గతంలో ఎంపీపీగా పనిచేసిన అనుభవం, స్థానికంగా ఉన్న పరిచయాలు, కూటమి మద్దతు నేపథ్యంలో ఆమె గెలుపుపై రాజకీయ విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆమె తప్పక విజయం సాధిస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.కలిగిరి జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో మండలంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.