
తెల్లపాడు ఎంపీటీసీగా నామినేషన్ దాఖలు
కలిగిరి, అక్టోబర్ 22: మన ధ్యాస ప్రతినిధి శ్రీకాంత్
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కలిగిరి మండల ఎంపీపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు బిజ్జం వెంకట కృష్ణారెడ్డి తెల్లపాడు ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా ఆయన సతీమణి, కలిగిరి మాజీ సర్పంచ్ బిజ్జం ఖాజా కుమారి కూడా అనంతపురం ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు.కలిగిరి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున 22, తెలుగుదేశం పార్టీ తరఫున 20 నామినేషన్లు దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారి (RO) శివప్రసాద్ తెలిపారు.ఎన్నికల ప్రక్రియలో భాగంగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో మండలంలో రాజకీయ సందడి నెలకొంది.