
కలిగిరి అక్టోబర్ 22 :మన ధ్యాస ప్రతినిధి శ్రీకాంత్
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కలిగిరి మండలం వెలగపాడు ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నర్రావుల భాగ్యలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు.నామినేషన్ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈమె పెద్దఅన్నలూరు వైసిపి నాయకులు నర్రావుల మాల్యాద్రి సతీమణి.నర్రావుల మాల్యాద్రికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఎంతో అభిమానం ఉందని, పార్టీ పట్ల తనకున్న అనుబంధంతో ప్రజా జీవితంలో ముందుకు సాగుతున్నారని కుటుంబ వర్గాలు పేర్కొన్నాయి.ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి, యువనేత అభినవ్ రెడ్డి ఆశీస్సులతో, కలిగిరి మండల కన్వీనర్ కాటం రవీంద్రారెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యులు పాలూరు మాల్యాద్రి రెడ్డి సహకారంతో నామినేషన్ దాఖలు చేశారని తెలిపారు.అదేవిదంగా వెలగపాడు పంచాయతీ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజాసేవలో ముందుంటానని తెలిపారు. గ్రామ ప్రజలు ఎదుర్కొనే సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. గ్రామ అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తానని, ఎవరికి ఏ ఆపద వచ్చినా వారికి అండగా నిలబడి సహాయం చేసేందుకు ముందుంటానని పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆమె తెలిపారు.భాగ్యలక్ష్మి నామినేషన్‌తో గ్రామంలో ఎన్నికల సందడి నెలకొంది.