
కలిగిరి, అక్టోబర్ 22: మన ధ్యాస ప్రతినిధి శ్రీకాంత్
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కలిగిరి మండలం వెలగపాడు ఎంపీటీసీ కూటమి అభ్యర్థిగా చిట్టిబోయిన సురేఖ నామినేషన్ దాఖలు చేశారు. ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆశీస్సులతో, కలిగిరి మండల కన్వీనర్ పూసల వెంగప నాయుడు సహకారంతో నామినేషన్ వేసినట్లు చిట్టిబోయిన సురేఖ తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజలకు మరింత చేరువగా ఉంటూ, వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, మహిళల సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల మెరుగుదలకు తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు.చిట్టిబోయిన సురేఖ గారు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు చిట్టిబోయిన భాస్కర్ గారి సతీమణి. చిట్టిబోయిన భాస్కర్ చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, ప్రజలతో ఆయనకు ఉన్న అనుబంధం స్థానికంగా గుర్తింపు పొందాయి.సురేఖ గారు నామినేషన్ దాఖలు చేయడంతో వెలగపాడు పంచాయతీలో ఎన్నికల సందడి నెలకొంది. సురేఖ నామినేషన్‌తో స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి. సురేఖ నామినేషన్ నేపథ్యంలో ఆమె విజయంపై రాజకీయ విశ్లేషకులు గెలుపు తథ్యమని అభిప్రాయపడుతున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.రానున్న ఎన్నికల్లో గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు కృషి చేస్తానని చిట్టిబోయిన సురేఖ తెలిపారు.