జడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైన సందర్భంగా, తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని తుడా ఛైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి ఈరోజు స్వయంగా సందర్శించి పరిశీలించారు.
నామినేషన్ కేంద్రం వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు యంత్రాంగం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు.
నామినేషన్ దాఖలు చేయడానికి విచ్చేసిన పలువురు ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను ఆయన ఆప్యాయంగా పలకరించి,వారికి శుభాకాంక్షలు తెలిపారు.

