

గాజువాక మన ద్యాస ప్రతినిధి అక్టోబర్18:జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో గాజువాక 90వ వార్డు జనసేన పార్టీ అభ్యర్థిగా లంకలత నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా లంక యువసేన,మహిళలు, కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. డీజే, తీన్మార్ డప్పుల నడుమ భారీ ర్యాలీ సాగిన మార్గంలో మహిళలు అడుగడుగునా హారతులు పట్టి లంకలతకు ఘన స్వాగతం పలికారు. యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతు ప్రకటించారు. గతంలో చేసిన సేవలను గుర్తుచేస్తూ నీ సేవలే నిన్ను గెలిపిస్తాయని లంకలతకు ఆశీర్వాదాలు అందించారు.అనంతరంజోనల్ కార్యాలయానికి చేరుకుని లంకలత నామినేషన్ పత్రాలను సమర్పించారు. తదనంతరం లంక లత మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆదరాభిమానం చూసి నాకు ఎంతో సంతోషంగా ఉందని 90 వార్డు నుంచి జనసేన కార్యకర్తలు వీర మహిళలు నాకు ఎంతగానో సహాయ సహకారాలు అందించారని 90 వ వార్డు నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచి డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ కి అలాగే పార్టీ పెద్దలకు ఈ వార్డులోంచి గెలిపించి బహుమతిగా అందజేస్తానని అన్నారు. ఈ వార్డులో గల ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలు మన్నన పొందిన నాయకురాలిగా నన్ను గుర్తించుతారని తెలిపారు. ఈ వాటిలో ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతి అణువణువు కూడా నాకు తెలుసు అని వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి చెత్త శుద్ధితో సమస్యలను పరిష్కరించే విధంగా నా వంతు సహాయ సహకారాలు ప్రజలకు ఎల్లవేళలా ఉంటాయని ప్రజలలో నిరంతరం తిరిగే వ్యక్తి కనుక నన్ను ప్రజలందరూ హాజరాభిమానిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో,కాలేపు సాయి,గోవింద్,కట్ట సాయి,చిత్రడ జోగరావు,సంతు,లంక కమేష్,వాణిశ్రీ,లంక బుజ్జి తదితరులు పాల్గొన్నారు