మన న్యూస్:నెల్లూరు జేమ్స్ గార్డెన్ లో పియస్బి ఆర్థో అండ్ పిడియాట్రిక్స్ హాస్పిటల్ ను ముఖ్యఅతిథిలు ప్రారంభించినారు.
ఈ సందర్భంగా కావలి డిఎస్బి శ్రీధర్ మాట్లాడుతు నెల్లూరు జేమ్స్ గార్డెన్ లో పిఎస్బి హాస్పిటల్ ప్రారంభించి నందుకు ఎంతో సంతోషంగా ఉంది అని అన్నారు. హాస్పిటల్ వారు పేద ప్రజలకు తక్కువ ఫీజుతో సేవలు చేయాలని, హాస్పిటల్ మంచి పేరు తెచ్చుకోవాలని హాస్పిటల్ మంచి దినదినాభివృద్ధి చెందాలని కోరుచున్నాను అని తెలిపారు.డాక్టర్ పి ఎస్ బి శ్రీనివాసులు మాట్లాడుతూ…నా ఆహ్వానాన్ని మన్నించి హాస్పిటల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన కావలి డిఎస్పి శ్రీధర్, శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచి పరమేశ్వర్ రెడ్డి తదితరుల పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ పి ఎస్ పి శ్రీనివాసులు బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు ,ప్రముఖ డాక్టర్లు, డాక్టర్ ఏ అమర జ్యోతి పాల్గొన్నారు.