
మన ధ్యాస,నెల్లూరు, అక్టోబర్ 18: నెల్లూరు నగర,12వ డివిజన్ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని 12వ డివిజన్ టీడీపీ అభ్యర్థి కిన్నెర సాగర్ తెలిపారు. డివిజన్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. స్థానిక శెట్టిగుంట రోడ్డు నుండి హై స్కూల్ వరకు వారి ర్యాలీ నిర్వహించారు. అనంతరం 12వ డివిజన్ టీడీపీ అభ్యర్థి కిన్నెర సాగర్ ఆదివారం నెల్లూరు స్టోన్ హౌస్ పేటలో ఉన్న బివి గర్ల్స్ హై స్కూల్లో నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కూటమితోనే సాధ్యమని పేర్కొంటూ, డివిజన్ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు. ప్రజలు తనకు అవకాశం కల్పిస్తే డివిజన్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో టిడిపి తరఫున మేయర్ గా పోటీ చేస్తున్నా పి. రూప్ కుమార్ యాదవ్, కిన్నెర మాలాద్రి, కిన్నెర కార్తీక్, కొండా ప్రవీణ్ శంకర్, స్థానిక నాయకులు,కార్యకర్తలు నాయకులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.
