
ఓసీ మహిళా రిజర్వేషన్ లో చెరుకూరి సింధు పేరు ఖరారు చేస్తే. అధిష్టానం ఆశీస్సులతో బరిలోకి
బీద రవిచంద్ర , కాకర్ల సురేష్ , బొల్లినేని రామారావు తో సత్సంబంధాలు. నాయకత్వంలో పార్టీ బలోపేతం
కొండాపురం, అక్టోబర్ 18, మన ధ్యాస ప్రతినిధి నాగరాజు.


నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం రాజకీయాల్లో కొండాపురం మండలం ఎప్పుడూ హాట్ yటాపిక్. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొండాపురం జెడ్పీటీసీ (ZPTC) స్థానం మరింత ఆసక్తికరంగా మారింది. ఈ స్థానం ఓసీ మహిళకు రిజర్వ్ కావడంతో ఎవరికి టికెట్ దక్కుతుందా అని అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో చెరుకూరి ఫ్యామిలీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. టీడీపీ అధిష్టానం నుంచి వారికి పూర్తి మద్దతు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.మూడు దశాబ్దాల అనుబంధం.. టీడీపీకి సేవలే సేవలు:కొండాపురం మండలంలో తెలుగుదేశం పార్టీ అంటే ముందుగా గుర్తొచ్చే పేర్లలో చెరుకూరి కుటుంబం ఒకటి. చెరుకూరి వెంకటాద్రి నాయుడు 2009 నుండి 2018 వరకు దాదాపు 9 ఏళ్ల పాటు కొండాపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పార్టీకి విశేష సేవలు అందించారు. పార్టీ అధికారంలో ఉన్నా, లేకున్నా పార్టీ జెండాను వదలకుండా ప్రజలతో మమేకమై తిరుగులేని నాయకుడిగా ఎదిగారు.గతంలో దివంగత నేత కోడె వెంకట్రావు మరియు చెరుకూరి వెంకటాద్రి నాయుడు ఇద్దరూ కలిసి మండలంలో పార్టీని భుజాలపై మోశారు. అనుకోని రోడ్డు ప్రమాదంలో కోడె వెంకట్రావు మరణించడం పార్టీకి, కుటుంబానికి తీరని లోటు.అగ్రనేతల అండ.. విడదీయలేని బంధాలు:చెరుకూరి ఫ్యామిలీకి ఎమ్మెల్సీ , జిల్లా టిడిపి అధ్యక్షులు బీద రవిచంద్ర , ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు తో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారి ఆశీస్సులు, సూచనలతోనే పార్టీ కార్యక్రమాల్లో ముందుంటున్నారు.అంతేకాకుండా చెరుకూరి మరియు పోలినేని కుటుంబానికి విడదీయలేని అనుబంధం ఉంది.యువ నాయకత్వం.. సేవా కార్యక్రమాల్లో ముందు:ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ చెరుకూరి నవీన్ ప్రస్తుతం టీఎన్ఎస్ఎఫ్ (TNSF) రాష్ట్ర కార్యదర్శిగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా కోడె వెంకట్రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు, పేద ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు.బరిలోకి చెరుకూరి సింధు - ఓసీ మహిళా అభ్యర్థిగా గెలుపు గుర్రం:ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కొండాపురం జెడ్పీటీసీ స్థానం ఓసీ మహిళకు కేటాయించడంతో, అధిష్టానం సూచనాలో చెరుకూరి నవీన్ సతీమణి, కోడె వెంకట్రావు తనయ అయిన చెరుకూరి సింధు (కోడె సింధు) ను బరిలోకి దింపాలని అధిష్టానం దాదాపు ఖరారు చేసే అవకాశం ఉంది.విద్యావంతురాలు, సేవా దృక్పథం ఉన్న మహిళగా సింధు కి మండలంలో మంచి ఆదరణ ఉంది. అధిష్టానం ఆదేశాల మేరకు తాము పోటీకి సిద్ధంగా ఉన్నామని, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నాయకత్వంలో కొండాపురం మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తామని వారు గతంలోనే తెలిపారు.సుదీర్ఘకాలం పార్టీకి సేవ చేసిన కుటుంబానికి అవకాశం ఇస్తే మండల టీడీపీ శ్రేణులు, కార్యకర్తల్లో హర్షం వ్యక్తమవుతోంది. జెడ్పీటీసీ గా ప్రకటిస్తే ఘన విజయం సాధించడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
