మన న్యూస్:గొల్లప్రోలు మనుధర్మం వద్దు రాజ్యాంగమే ముద్ద నినాదంతో మనువాద నకళ్ళను మంటలో తగలబెట్టిన దళిత సంఘాలు, కాకినాడ జిల్లా పిఠాపురం,మనువాదులకు అనుకూలంగా మనుధర్మ శాస్త్రం తయారు చేసుకునే బడుగు బలహీనవర్గాలు, మహిళల హక్కులకు భంగం కలిగే క్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మంచి ఆలోచనచేసి 1927,, డిసెంబర్ 25 తేదిన మహారాష్ట్రఅసెంబ్లీ ఎదురుగా మనుధర్మా శాస్త్రాన్నిచితిముట్టించడం, జరిగిందని బానిసత్వం, హింసాత్మక మైన రోజు నుండి గట్టెక్కించిన రోజును గుర్తు చేసుకుంటూ బుధవారం స్థానిక రకాల పేట అంబేద్కర్ విగ్రహం వద్ద మను ధర్మ శాస్త్ర నికి సంబంధించిన కడపత్ర ఆనవాళ్లను దళిత సంఘాలు తగలబెట్టడం జరిగిందని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి సాకారామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాల మహానాడు పిఠాపురం ఇంచార్జ్ వేలంగి వెంకటేష్, బహుజన పార్టీ పిఠాపురం ఇన్చార్జ్ ఖండవల్లి లావరాజు పాల్గొని ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి , మనుధర్మ శాస్త్రానికి ఆడవాళ్లు పత్రాలను మంటలో తగలబెట్టడం జరిగింది, అనంతరం వారు మీడియాతో మాట్లాడారు, సనాతన ధర్మం, అనే పేరుతో ఆర్ఎస్ఎస్ కుట్ర ఆలోచనలతో హైంద వర్గాల కు పెత్తనమే కొనసాగాలని బడుగు బలహీన వర్గాలు అణచవేతకి గురిచేయాలని సదుద్దేశంతో మళ్లీ మనుధర్మ శాస్త్రాన్ని తెరమైనదికి తెచ్చే ఆలోచన మానుకోవాలని ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న బడుగు బలహీన వర్గాలు మళ్లీ ఈ మనుధర్మ శాస్త్రం వెలుగులోకి వస్తే బడుగు బలహీన వర్గాలు పూర్వకాల పరిస్థితిలు వస్తాయని వారు అన్నారు ఈ మనుధర్మం పేరుతో పాలన విధానం ముందుకెళితే సహించబోమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో , డి ప్రసాద్ మాత నాగేశ్వరరావు గురుముచ్చి ఆనందరావు , శేఖర్, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు