మన న్యూస్:గొల్లప్రోలు రాత్రి సమయంలో చలిలో నిద్రిస్తున్న పలువురికి పిఠాపురం నియోజకవర్గ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ పి సి ఇ డబ్ల్యూ ఎ సభ్యులు రగ్గులు పంపిణీ చేశారు. గొల్లప్రోలు లోని బస్టాండ్, రైల్వే స్టేషన్,రామకోవెల, శివాలయం ప్రాంతంలో చలిలో నిద్రిస్తున్న 15 మందికి రగ్గులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పి సి ఇ డబ్ల్యూ ఎ వ్యవస్థాపక అధ్యక్షులు చామంతి నాగేశ్వరరావు, అధ్యక్షులు చందు బాబూరావు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు కొండేటి సత్యనారాయణ, కొమ్ము సత్యనారాయణ, సిహెచ్ పుల్లపరాజు, పడాల రాము, సత్తిబాబు, గిరుతూరి సత్యనారాయణ, వూటా స్వామి, స్టేషన్ మాస్టర్ కోటేశ్వరరావు, స్వచ్ఛ గొల్లప్రోలు సభ్యులు కొసిరెడ్డి రాజా,పెద్దిరెడ్ల వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు.