
జలదంకి మండలంలో టీడీపీకి భారీ బలం.. వైసీపీకి గట్టి షాక్*
*వింజమూరు, అక్టోబర్ 17, మన ధ్యాస ప్రతినిధి నాగరాజు.


జలదంకి మండల రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మండలంలో తెలుగుదేశం పార్టీకి భారీ బలం చేకూరగా వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.జలదంకి మండలం *అన్నవరం గ్రామానికి* చెందిన వైసీపీ మాజీ మండల కన్వీనర్ *పాలవెల్లి మాలకొండారెడ్డి* తన ముఖ్య అనుచరులు, నాయకులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. వింజమూరులోని *ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో* శుక్రవారం జరిగిన భారీ చేరికల కార్యక్రమంలో *ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్* సమక్షంలో మాలకొండారెడ్డితో పాటు అన్నవరం గ్రామానికి చెందిన సుమారు *195 కుటుంబాలు* టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పార్టీలో చేరిన వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీడీపీ సిద్ధాంతాలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంపై నమ్మకంతోనే పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి నాయకులు, కుటుంబాలు టీడీపీలో చేరుతున్నారని అన్నారు.గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని, కూటమి ప్రభుత్వం వచ్చాకనే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి చేరుతున్నాయని, అందుకే ప్రజలు స్వచ్ఛందంగా టీడీపీ వైపు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అన్నవరం గ్రామంలో పాలవెల్లి మాలకొండారెడ్డికి ఉన్న పట్టు, ఆయన రాజకీయ అనుభవంతో జలదంకి మండలంలో టీడీపీ క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం అవుతుందని అన్నారు.పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత గౌరవం, ప్రాధాన్యత కల్పిస్తామని, ప్రజాసేవలో భాగస్వాములను చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ చేరికలతో జలదంకి మండలంలో టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొనగా, వైసీపీకి కోలుకోలేని దెబ్బగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.*ఈ కార్యక్రమంలో* జలదంకి టీడీపీ మండల అధ్యక్షులు *మునగాల తిరుమలరెడ్డి*, సోమశిల ప్రాజెక్టు ఉపాధ్యక్షులు *మధు రెడ్డి*, టీడీపీ సీనియర్ నాయకులు *భాస్కర్ రెడ్డి, అప్పల నాయుడు, జై చంద్ర రెడ్డి* తో పాటు మరికొందరు సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
