
*వరికుంటపాడు, అక్టోబర్ 17, మన ధ్యాస ప్రతినిది నాగరాజు.
వరికుంటపాడు మండలం తూర్పు రొంపిదొడ్ల గ్రామంలో కొలువుదీరిన శ్రీ మానసా దేవి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. ఏడవ రోజు శనివారం అమ్మవారిని *కాలరాత్రి అలంకారంలో* సర్వాంగ సుందరంగా అలంకరించారు.చల్లా వంశస్థుల ఆధ్వర్యంలో ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు గోత్రనామాలతో పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. భక్తులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.దుర్గాదేవి ఉగ్రరూపాల్లో ఒకటైన కాలరాత్రి అమ్మవారిని దర్శించుకోవడం శుభప్రదమని భక్తుల నమ్మకం. దుష్టశక్తులను సంహరించి భక్తులకు అభయాన్ని ప్రసాదించే తల్లిగా కాలరాత్రి దేవిని కొలుస్తారు. తమ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు.ఉత్సవాలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఆలయాన్ని పుష్పాలు, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు.