మనన్యూస్:తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగోరు మురళీ కృష్ణారెడ్డి మాతృమూర్తి పులిగోరు నాగరత్నమ్మ 23వ వర్ధంతిని పురస్కరించుకొని 500 మంది పేదలకు పులిగోరు మురళీకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. బుధవారం బండ్ల వీధిలో బండ్ల వీధి యూత్ ఆధ్వర్యంలో పులిగోరు నాగరత్నమ్మ శిలాఫలకానికి పూజలు నిర్వహించి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో కార్పొరేటర్ఆర్ సి మునికృష్ణ, జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాజారెడ్డి బిజెపి నేత గుండాల గోపీనాథ్ రెడ్డి టిడిపి రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి మహబూబ్బాషా బండ్ల వీధి మురుకంబట్టు చంద్రారెడ్డి పులిగోరు సతీష్ రెడ్డి పులిగోరు వీణారెడ్డి బెంజి సుధాకర్ రెడ్డి రెడ్డప్ప గారి చంద్రారెడ్డి కన్నయ్య రాజు పాల్గొన్నారు.