
వరికుంటపాడు, అక్టోబర్ 16, మన ధ్యాస ప్రతినిధి నాగరాజు.

వరికుంటపాడు మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా చండ్ర విజయలక్ష్మిని టీడీపీ వరికుంటపాడు జడ్పిటిసి అభ్యర్థిగా అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో శుక్రవారం నాడు పార్టీ కార్యాలయంలో ఆయన బృందంతో కలిసి చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు తెలుగుదేశం పార్టీ విధేయుడుగా మండలంలో క్రియాశీలక నాయకుడిగా పలుమార్లు మండల కన్వీనర్ గా గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలతో ఉన్నటువంటి సత్సంబంధాలు తదితర అనేక విషయాలు చర్చించారు. అనేక ఏళ్లుగా ప్రజాసేవ, గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరించడం జరిగిందని అలాగే కార్యకర్తలు సమస్యలను నాయకుల సమస్యలను పరిష్కారానికి అటు ప్రతిపక్షంలోనూ అధికారపక్షంలోనూ కృషి చేయడం జరిగిందని తెలిపారు. పార్టీకి విధేయులుగా ఉన్న తమకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ విషయంపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సానుకూలంగా స్పందించారని తెలుస్తుంది.క్షేత్రస్థాయిలో ముమ్మర ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీ జడ్పిటిసి అభ్యర్థిగా చండ్ర విజయలక్ష్మిని నియమించినందుకు మాజీ మండల కన్వీనర్ చండ్ర వెంకయ్య క్షేత్రస్థాయిలోనూ నాయకులతో కార్యకర్తలతో చర్చిస్తూ మద్దతు పొందే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు సానుకూలంగా స్పందిస్తూ సంఘీభావం తెలుపుతున్నారని తెలుస్తుంది. పార్టీ అధిష్టానం అవకాశం కల్పిస్తే భారీ స్థాయిలో గెలుపుకు అవకాశాలు ఉన్నాయని నాయకులు కార్యకర్తలు తెలియజేస్తున్నారు.