మన న్యూస్: ప్రత్తిపాడు మండలం లంపకలోవ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో సీఈవో ఒమ్ము కృష్ణమూర్తి ఆధ్వర్యంలో సొసైటీ పరిధిలో ఉన్న రైతులతో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి డాక్టర్ ఎస్ ఎల్ ఎన్ టి శ్రీనివాస్ సమావేశమయ్యారు.ప్రత్తిపాడు ప్రాంత పరిధిలోని సహకార సహకార సంఘాలను సందర్శిస్తున్న రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్
ఎస్ ఎల్ ఎన్ టి శ్రీనివాస్ స్థానిక శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభని మర్యాదపూర్వకంగా కలిసి సహకార వ్యవస్థ బలోపేతానికి,కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ తీసుకున్న వివిధ నిర్ణయాలు గురించి వివరించారు.ఈ సందర్భంగా లంపకలోవ పిఎసిఎస్ లో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానంలో భాగంగా సహకార సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావడానికి కేంద్ర సహకార మంత్రి శాఖ వివిధ విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నదని వాటి అమలు ద్వారా సహకార సంఘములు ఆర్థిక వనరులను పెంపొందించుకుని సభ్యుల అవసరాలు మేరకు పనిచేయవలసిన అవసరం ఉన్నదని,ముఖ్యంగా సంఘం నిర్వహణ ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించవలసిన అవసరం ఉన్నదని,సభ్యుల భాగస్వామ్యాన్ని పెంచే విధంగా వారికి అవగాహన పెంపొందించడానికి మరియు వ్యాపార అభివృద్ధి ప్రణాళికలను రూపొందించుకోవాలని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి డాక్టర్ ఎస్ ఎల్ ఎన్ టి శ్రీనివాస్ సంఘ సందర్శన సందర్భంగా ఉద్భోదించినారు.సహకారం ద్వారా ఆర్థిక సమృద్ధి అనే నినాదంలో భాగంగా దేశవ్యాప్తంగా రెండు లక్షల బహుళార్థ సేవలు అందించే సహకార సంస్థలు ఏర్పాటు కానున్నయాన,ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో డైరీ మరియు ఫిషరీస్ సహకార సంఘంలో ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని గుర్తించి కేంద్ర సహకార మంత్రి శాఖ నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని డాక్టర్ శ్రీనివాస్ తెలియచేసారు.వీటి ఏర్పాటులో భారత ప్రభుత్వ సంస్థల అయినటువంటి నాబార్డు ఎన్డిపిడిబి ఎన్సీడీసీ ఎన్నఫ్డిపి వంటి సంస్థలకు మార్గదర్శకాలు సూచించడం జరిపినదని వీటి అమలుకు కేంద్ర స్థాయిలో వివిధ మంత్రిత్వ శాఖలతో కూడిన నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ రాష్ట్రస్థాయిలో రాష్ట్ర సహకార అభివృద్ధి కమిటీలు,జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ యొక్క ఆధ్వర్యంలో జిల్లా సహకార అభివృద్ధి కమిటీలు ఏర్పాటు కావడం జరిగినదని డాక్టర్ శ్రీనివాస్ తెలియజేశారు.