
నిజాంసాగర్, (మన ధ్యాస): నిజాంసాగర్ మండలంలోని వెల్గనూర్ గ్రామంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేసి యజ్ఞాన్ని నిర్వహించారు.గ్రామ పెద్ద ప్రతాప్రెడ్డి ఆధ్వర్యంలో యజ్ఞ కార్యక్రమం జరగగా, నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో మహిళలు కుంకుమార్చనలో పాల్గొన్నారు.భక్తులు అమ్మవారికి పూజలు సమర్పించి తమ కుటుంబాల శ్రేయస్సు కోసం ప్రార్థించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి.నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. యజ్ఞం, పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. అనంతరం భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, పలువురు భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.గ్రామస్తుల సహకారంతో పూజలు, యజ్ఞం, అన్నదాన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో
దుర్గామాత భక్తులు మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
