శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండో రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు జ్ఞానస్వరూపిణి అయిన సరస్వతీ దేవి అలంకారంలో వీణాపాణియై దివ్య ‘హంస వాహనం’పై భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ పవిత్ర వాహన సేవలో తుడా ఛైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.
వీధుల్లో తిరుమాడ భక్తులు చేసిన గోవింద నామస్మరణతో తిరుమల గిరులు మార్మోగాయి,ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు, ప్రముఖ ప్రజాప్రతినిధులు మరియు అశేష భక్తజనం పాల్గొన్నారు.

