సుగమం కానున్న గ్రామీణ - పట్టణ ప్రయాణం: కొట్ర మంగళం రోడ్డు టు తిరుచానూరు పూడి జంక్షన్ వరకు విస్తరణ పనులు ప్రారంభం
శ్రీ పద్మావతి అమ్మవారి భక్తులకు, నిత్య ప్రయాణికులకు ట్రాఫిక్ చిక్కుల నుంచి శాశ్వత విముక్తి
నిన్న వర్చువల్ విధానంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
క్షేత్రస్థాయిలో భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్,తుడా ఛైర్మన్, వైస్ చైర్మన్, జేఈవో, ఎమ్మెల్యే, కార్పొరేషన్ చైర్మన్లు అధికారులు
ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి నగరం శరవేగంగా విస్తరిస్తున్న వేళ, పెరిగిన అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనలో తుడా మరో కీలక ముందడుగు వేసింది. నగర బాహ్య వలయ కనెక్టివిటీని బలోపేతం చేస్తూ, కొట్ర మంగళం రోడ్డు నుండి తిరుచానూరు పూడి జంక్షన్ వరకు చేపట్టనున్న నూతన ఆధునిక రహదారి నిర్మాణ పనులకు మంగళవారం ఘనంగా భూమిపూజ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ,తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి , చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని , తుడా వైస్ ఛైర్మన్ ఆర్. గోవింద రావు , తితిదే జేఈఓ శరత్ , బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి , భానుప్రకాశ్ రెడ్డి , వన్నెకుల క్షత్రియ ఛైర్మన్ సి ఆర్ రాజన్ , యాదవ కార్పొరేషన్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
తిరుపతి పరిసర ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు.
నగర విస్తరణకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన కనెక్టివిటీ, అభివృద్ధి ఫలాలను అందించేందుకు తుడా నిరంతరం కృషి చేస్తుందని వెల్లడించారు.
ఈ భూమి పూజ కార్యక్రమంలో తుడా అధికారులు, ఇంజనీరింగ్ విభాగం ప్రతినిధులు, కూటమి ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.


