నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వర్చువల్ శంకుస్థాపన.
క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులను ప్రారంభించిన తుడా చైర్మన్, ఎమ్మెల్యే, ప్రముఖులు.
స్ప్రింగ్ డేల్ స్కూల్ నుండి శెట్టిపల్లి వరకు రూపుదిద్దుకోనున్న 80 అడుగుల అనుసంధాన రహదారి
తిరుపతి నగర విస్తరణ, భవిష్యత్ ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కరకంబాడి ప్రధాన రహదారి స్ప్రింగ్ డేల్ స్కూల్ సమీపం నుండి శెట్టిపల్లి వరకు చేపట్టనున్న 80 అడుగుల నూతన రోడ్డు నిర్మాణ పనులకు మంగళవారం అధికారికంగా భూమిపూజ నిర్వహించారు.
ఈ ప్రాజెక్టుకు నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి నుండి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయగా, క్షేత్రస్థాయిలో పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని తుడా మరియు ప్రజాప్రతినిధులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.
ఈ భూమిపూజ కార్యక్రమంలో తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి , తుడా వైస్ చైర్మన్ ఆర్. గోవిందరావు ,తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు , పార్లమెంట్ అధ్యక్షులు పనబాక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
శెట్టిపల్లి పరిసరాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, ఈ రోడ్డు పూర్తయితే స్థానికులకు ప్రయాణ సమయం తగ్గడంతో పాటు కారకంబాడి మార్గంపై ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందని నేతలు వివరించారు.
ఈ కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ ,తిరుపతి ఇంచార్జి జేబీ శ్రీనివాస్ , వివిధ కార్పొరేషన్ చైర్మన్లు,కూటమి ముఖ్య నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు,తుడా అధికారులు,శెట్టిపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు.


